అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ తమపై చేసిన ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్ పర్సన్ మాధవీ పూరీ, ఆమె భర్త ధావల్ బుచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ సంయుక్త ప్రకటన జారీ చేశారు.
హిండెన్‌బర్గ్ పై సెబీ చర్యలు తీసుకోకూడదో తెలుపాలంటూ తాము ఆ సంస్థకు షోకాజ్ నోటీస్ పంపినందుకే అది తమపై కక్షగట్టి ఇటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతోందని ఆరోపించారు. సెబీలో చేరక మునుపు అనేక ఏళ్ళలో తమ ఇద్దరి ఆర్ధిక లావాదేవీలను సెబీకి సమర్పించామని, నేటికీ ఎప్పటికప్పుడు సమర్పిస్తూనే ఉన్నామని వారు చెప్పారు.
తమ జీవితం తెరిచిన పుస్తకం వంటిదని, తమ ఆర్ధిక లావాదేవీల గురించి భారత్ ప్రభుత్వానికి కూడా తెలుసునన్నారు. ఒకవేళ తమ పెట్టుబడులపై ఏమైనా అనుమానాలుంటే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తుందని కానీ హిండెన్‌బర్గ్ తమ వ్యకిత్వ హనానికి పాల్పడుతూ తమ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తోందని మాధవీ పూరీ, ఆమె భర్త ధావల్ బుచ్ ఆరోపించారు.