పవన్‌ వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ని ఉద్దేశ్యించేనా?

August 09, 2024


img

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ గురువారం బెంగళూరు వెళ్ళి కర్ణాటక సిఎం సిద్దరామయ్యతో భేటీ అయ్యారు. చిత్తూరు జిల్లాలో భీభత్సం సృష్టిస్తున్న ఏనుగులను కట్టడి చేయడంలో శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలని అడగగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా వారు ఎర్రచందనం స్మగిలింగ్ అరికట్టడం, పర్యావరణ పరిరక్షణ అంశాలపై కూడా చర్చించారు. పార్టీలకు అతీతంగా రెండు రాష్ట్రాలు సహకరించుకోవడానికి అంగీకరించారు. 

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ, “ఒకప్పుడు సినిమాలలో హీరోలు అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు అడవులలో ఎర్ర చందనం చెట్లను నరికి పోలీసులకు, అటవీశాఖకు పట్టుబడకుండా ఎలా స్మగిలింగ్ చేయాలో చూపిస్తున్నాడు.

ఈ ధోరణి సరికాదు. నేను కూడా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వాడినే. ఇలాంటి చిత్రాలలో నటించడానికి నేను ఇష్టపడను. మన సినిమాల ద్వారా సమాజానికి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత హీరోల మీదే ఉంటుందని మరిచిపోకూడదు,” అని అన్నారు. 

పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ చేస్తున్న పుష్ప-2 సినిమాని ఉద్దేశ్యించి చేసినవే అని అర్దమవుతూనే ఉంది. నేను కూడా సినీ పరిశ్రమకు చెందినవాడినే అంటూ పవన్‌ కళ్యాణ్‌, పుష్ప సినిమాపై ఈవిదంగా ఎందుకు కామెంట్స్ చేశారో అందరికీ తెలుసు. బహుశః ఆ కారణం చేతే పుష్ప-2 రిలీజ్ డిసెంబర్ కు వాయిదా వేసుకున్నారేమో కూడా?


Related Post