మళ్ళీ బిఆర్ఎస్ గూటికి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి!

July 30, 2024


img

గద్వాల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ మంగళవారం కాంగ్రెస్‌ని వీడి మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. తిరిగి వచ్చిన ఆయనకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఇతర ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీ కండువా కప్పి సాదరంగా బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.

అయితే కొన్ని రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్‌ వీడి మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ గూటికి ఎందుకు చేరుకున్నారనే విషయం ఇంకా తెలియవలసి ఉంది.

ఆయన తన వ్యాపార ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని ఇదివరకు కేటీఆర్‌ విమర్శించారు. కనుక బహుశః ఆ విషయంలో సిఎం రేవంత్‌ రెడ్డి నుంచి ఎటువంటి హామీ లభించకపోవడం వలన బిఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వచ్చేసి ఉండవచ్చు.

దీంతో శాసనసభలో కాంగ్రెస్‌ బలం 73కి తగ్గగా, బిఆర్ఎస్ బలం మళ్ళీ 29కి పెరిగిన్నట్లయింది. గత కొన్ని రోజులుగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులు నిలిచిపోయాయి. కనుక కాంగ్రెస్‌ ఇక బిఆర్ఎస్ పార్టీ జోలికి పోకుండా ఉంటుందా? లేదా మద్యలో గ్యాప్ ఇచ్చిందా? త్వరలో తెలుస్తుంది. 


Related Post