రేవంతూ ప్రజలు జాడిస్తారు జాగ్రత్త: బిఆర్ఎస్‌

July 24, 2024


img

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు కేటాయించకపోగా కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా లేదు. దీనిని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కూడా తీవ్రంగా తప్పు పడుతున్నారు. అయితే సిఎం రేవంత్‌ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీని బడే బాయ్ అని, గుజరాత్ మోడల్ అభివృద్ధి దేశానికి ఆదర్శమని పొగిడినా మోడీ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా విధించలేదు. తగుదునమ్మా అని ఇప్పుడు కేసీఆర్‌కు సవాల్ విసిరితే జనం జాడిస్తారు రేవంతూ... అంటూ బిఆర్ఎస్‌ పార్టీ ట్వీట్‌ చేసింది. 

లోక్‌సభ ఎన్నికలలో రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు 16 ఎంపీ సీట్లు కట్టబెడితే రాష్ట్రానికి అణాపైసా తేలికపోయిన దద్దమలు మీరు అంటూ ఎద్దేవా చేసింది. తెలంగాణ ప్రయోజనాల విషయంలో కేసీఆర్‌ నిబద్దత ఏమిటో దేశం మొత్తం చూసిందని బిఆర్ఎస్ పార్టీ ట్వీట్‌ చేసింది.

మోడీ ప్రభుత్వానికి జేడీయూ, టిడిపిల మద్దతు కీలకంగా మారడంతో ఈసారి బడ్జెట్‌లో ఆ రెండు రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి నిధులు కేటాయించింది. దీనిని ఎవరూ తప్పు పట్టడం లేదు కానీ బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్నే అందరూ తప్పు పడుతున్నారు. 

బీజేపీ అధిష్టానం తెలంగాణలో రాజకీయాలు చేస్తూ అధికారంలోకి రావాలని తహతహలాడుతుంది తప్ప రాష్ట్రానికి నిధులు కేటాయించాలనుకోలేదు. అందుకే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిపించినా వారి వలన రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదని బిఆర్ఎస్ పార్టీ వేలెత్తి చూపగలుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీజేపీ, బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించనందుకు శాసనసభలో ఏమి చెప్పుకుంటుంది? తమని గెలిపించిన ప్రజలకు ఏం చెప్పుకుంటారు?          


Related Post