శాసనసభ ఎన్నికలలో ఓటమి తర్వాత నుంచే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడటం మొదలైంది. లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు గెలుచుకోలేకపోవడంతో మరింత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు.
తాజాగా రాజేంద్రనగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ శుక్రవారం సాయంత్రం సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ప్రకాష్ గౌడ్‌తో కలిపి ఇప్పటి వరకు బిఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నికలో ఆమె సోదరి లాస్య నివేదిత పోటీ చేసి ఓడిపోవడంతో ఆ సీటుని కూడా కాంగ్రెస్ గెలుచుకోండి. దీంతో శాసనసభలో కాంగ్రెస్ బలం 65 నుంచి 73కి పెరగగా, బిఆర్ఎస్ పార్టీ బలం 39 నుంచి 30కి పడిపోయింది.
వారం పది రోజులలో మరో ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు బిఆర్ఎస్ పార్టీని వీడిన ఎమ్మెల్యేలు:
1. ప్రకాష్ గౌడ్
2. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
3. సంజయ్ కుమార్
4. పోచారం శ్రీనివాస్ రెడ్డి
5. దానం నాగేందర్
6. కడియం శ్రీహరి
7. తెల్లం వెంకట్రావు
8. కాలే యాదయ్య.
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు:
1.బస్వరాజు సారయ్య
2. దండే విఠల్
3. యెగ్గే మల్లేశం
4. భాను ప్రసాదరావు
5. ప్రభాకర్ రావు
6. బొగ్గారపు దయానంద్.