తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు?

June 23, 2024


img

రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. ఆయనతో కలిపిమొత్తం 12 మంది మంత్రులున్నారు. ఇంకా మరో ఆరుగురికి అవకాశం ఉంది. కానీ లోక్‌సభఎన్నికల హడావుడి కారణంగా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేకపోయారు. లేదా  బీఆర్ఎస్ పార్టీలో ఒకరిద్దరు ముఖ్యనేతలను ఆకర్షించేందుకే వాటిని ఇంతకాలం పెండింగులో ఉంచి ఉండవచ్చుకూడా.

కానీ ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయినందున, ఇంకా ఆలస్యంచేస్తే పదవులు ఆశిస్తున్నవారిలో అసంతృప్తి, అసహనం పెరిగితే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికే ఇబ్బంది. కనుకఆరుగురు కొత్త మంత్రులతో జూలై 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేయించుకు ముహూర్తం ఖరారు అయిన్నట్లుకాంగ్రెస్‌ నేతలు చెపుతున్నారు.

ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డిజిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. అలాగే మైనార్టీ ముదిరాజ్‌ వర్గాలకు చెందినవారికి కూడామంత్రివర్గంలో అవకాశం లభించలేదు. కనుక ఈసారి వారికి అవకాశం  లభించవచ్చు. ఇప్పటికే ఈ నాలుగు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలలో కొందరి పేర్లను కాంగ్రెస్‌ అధిష్టానం ఆమోదానికి పంపిన్నట్లు తెలుస్తోంది. వారిలో అందరూ కాంగ్రెస్‌వారేఉంటారా... లేదా ఇటీవల బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినవారికి కూడా అవకాశం కల్పిస్తారా? అనేది మరికొద్దిరోజులలో తెలుస్తుంది.


Related Post