ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారడంతో రెండు రాష్ట్రాలలో కొత్త మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు. అయితే కేసీఆర్ తొలి ప్రభుత్వంలో సాగునీటిశాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
ఆ పనుల కోసం నిత్యం సంబంధిత అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ఇంజనీర్లతో చర్చిస్తుండేవారు. ప్రాజెక్టులన్నీ కలియ తిరుగుతూ స్వయంగా పనులు పర్యవేక్షించేవారు. కనుక ఆయన రాష్ట్రంలో ప్రతీ ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉంది.
ఆ తర్వాత ఆర్ధికశాఖ మంత్రిగా కూడా చేయడంతో దానిపై కూడా పూర్తి పట్టు సాధించగలిగారు. రాజకీయంగా చూస్తే ఆయనకు చాలా మంచి పేరుంది. ఎప్పుడైనా బిఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది ఏర్పడితే కేసీఆర్ ఆయననే పంపించేవారు.
ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం, హుందాగా మాట్లాడటం వంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నందున బిఆర్ఎస్ పార్టీలో, ప్రజలలో కూడా ఆయనకు మంచి గౌరవం ఉంది.
ఆయనకు పూర్తిభిన్నమైన వ్యక్తి ఏపీ మాజీ సాగునీటి శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఆయనకు తన శాఖ, దానిలో జరుగుతున్న ప్రాజెక్టులు, పనుల గురించి పెద్దగా అవగాహన లేదు. కనుక ఏనాడూ వాటి గురించి మాట్లాడేవారు కారు. కానీ మంచి మాటకారి కావడంతో ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ని అవహేళన చేస్తూ జగన్ మెప్పు పొందేవారు.
అంబటి రాంబాబు ఓ మహిళతో చేసిన అశ్లీల ఫోన్ సంభాషణ బయటకు పొక్కడంతో అప్పటి నుంచి ఏపీలో ఆయన అరగంట మంత్రిగా చాలా పాపులర్ అయిపోయారు.
మంత్రి హోదాలో హుందాగా వ్యవహరిస్తూ గౌరవం సంపాదించుకోవలసి ఉండగా, సంక్రాంతి పండుగ వస్తే తన సత్తెనపల్లి నియోజకవర్గంలో లాటరీ నిర్వహిస్తూ, రోడ్లపై డ్యాన్సులు చేస్తుంటారు. అది చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిసినా జగన్ కూడా ఆయనను వారించలేదు.
ఇవన్నీ ఒక ఎత్తు. ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏపీకి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడినా మాటలు ఒకటీ ఒక ఎత్తు. ఆ ప్రాజెక్టు గురించి తనకు అసలు ఏమీ తెలియదని స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పుకోవడం విశేషం. ఆయన మాటలు విన్నప్పుడు మన హరీష్ ఎంత గొప్పవాడో అర్ధమవుతుంది.
🔶 పోలవరం అనేది ఎవరికీ అర్థం కానిది.. ఎందుకంటే ఈ మేధావికి అర్థం కాలేదుట
— TeluguBulletin.com (@TeluguBulletin) June 18, 2024
🔶 పోలవరం ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని ఐదేళ్లూ గడిచాక తీరిగ్గా చెబుతున్న అంబటి
🔶 అధికారంలో ఉన్నప్పుడు ఈ మాట చెప్పలేదేం? వైఎస్సార్ పోలవరం అని పేరు తగిలించుకున్నప్పుడు ఈ బుద్ధి ఎక్కడ పోయింది?
🔶 నింపాదిగా… pic.twitter.com/8okTyDET6m