హైదరాబాద్‌లో ఏపీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన లోటస్ పాండ్ నివాసం బయట ఫుట్ పాత్‌ని ఆక్రమించి నిర్మించిన షెడ్లను జీహెచ్‌ఎంసీ సిబ్బంది కూల్చి వేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ కోర్టులో అక్రమస్తుల కేసులలో ఆ భవనం కూడా ఒకటి. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు జీహెచ్‌ఎంసీలో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఆ భవనం బయట షెడ్లను కూల్చివేసినందుకు ఖైరతాబాద్ జోనల్ కమీషనర్ హేమంత్‌ని సాధారణ పరిపాలన శాఖకు అప్పగిస్తూ జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమీషనర్‌గా ఆంరపాలి ఆదేశాలు జారీ చేశారు.
హేమంత్ చర్యల వలన న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించి ఆయనపై వేటు వేసిన్నట్లు తెలుస్తోంది.
ఇదివరకు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే లోటస్ పాండ్ నివాసంలోనే బస చేసేవారు. కనుక ఆయనకు అధనపు భద్రత కల్పించేందుకుగాను లోటస్ పాండ్ భవనం బయట ఫుట్ పాత్‌ని ఆక్రమించి భద్రతా సిబ్బంధి కోసం షెడ్లు నిర్మించారు.
కానీ అప్పటి నుంచి నిత్యం ఆ మార్గంలో రాకపోకలు సాగించేవారు వాటి వలన ఇబ్బంది పడుతున్నారు. జీహెచ్‌ఎంసీకి పలుమార్లు పిర్యాదులు చేశారు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ ఎన్నికలలో ఓడిపోయి ముఖ్యమంత్రి పదవి కోల్పోయినందున ఆ షెడ్లు తొలగించి ప్రజా సమస్యకు పరిష్కారం చూపాలని హేమంత్ అనుకున్నారు. కానీ మంచికి పోతే చెడు ఎదురైన్నట్లు ఈవిదంగా జరిగడం బాధాకరమే.