లిక్కర్ స్కామ్‌ కాదు... మోడీ స్కీమ్: కేసీఆర్‌

April 24, 2024


img

మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ మంగళవారం ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ టీవీ9 ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా, “ అది స్కామ్‌ కాదు మోడీ రచించిన ఓ పెద్ద స్కీమ్. ఆయన రాజకీయ కక్షతోనే ఈ స్కీమ్ రచించి నా కూతురు కల్వకుంట్ల కవితని, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌ని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ని అడ్డం పెట్టుకొని సీబీఐ చేత ఈ స్కీమ్ అమలు చేయించారు. 

ప్రతీ రాష్ట్ర ప్రభుత్వానికి వేర్వేరు మద్యం పాలసీలు ఉంటాయి. అలాగే ఢిల్లీ ప్రభుత్వానికి కూడా ఉంది. దాంతో నా కూతురు కల్వకుంట్ల కవితకి ఏమిటి సంబంధం?మూడేళ్ళుగా దీనిపై సీబీఐ, ఈడీలు విచారణ జరుపినా ఒక్క పైసా రికవరీ చేయలేదు. ఒక్క ఆరోపణని నిరూపించలేకపోయాయి. అంటే ఇది స్కామ్‌ కాదు ఫెయిల్ అయిన మోడీ స్కీమ్ అని స్పష్టం అవుతోంది. అసలు ఇది ఓ కేసే కాదు. ఈ కేసుతో నా కూతురు కవితకి ఎటువంటి సంబందమూ లేదు. ఆమె కడిగిన ముత్యంలా తిరిగివస్తుంది. 

ఆనాడు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి నా ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కుట్రలు చేసిన బీజేపీ నాయకుడు బిఎల్ సంతోష్‌కి నోటీసులు ఇచ్చేందుకు నేను తెలంగాణ పోటీలులను ఢిల్లీలో బీజేపీ కార్యాలయానికి పంపినందుకే మోడీ మాపై కక్ష కట్టి ఆడపిల్ల అని కూడా చూడకుండా నా కూతురు కల్వకుంట్ల కవిత ఇంత దుర్మార్గంగా ఈ కేసులో ఇరికించి జైలులో నిర్బందించి బెయిల్‌ లభించకుండా చేస్తున్నారు.

ఈ కేసులో అరెస్టులు మోడీ నియంతృత్వానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. మోడీ ఇంతకు ఇంతా అనుభవించక మానరు,” అని కేసీఆర్‌ అన్నారు. 


Related Post