మరో నోటిఫికేషన్‌ జారీ చేసిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్

April 29, 2022


img

   తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గురువారం మరో 677 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రవాణా, అబ్కారీ శాఖలలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వాటిలో ట్రాన్స్‌పోర్ట్‌ కానిస్టేబుల్స్ (హెచ్‌వో) 6 పోస్టులు, ఎల్‌ కానిస్టేబుల్స్ 57 పోస్టులు కూడా ఉన్నాయి. ఆ వివరాలు: 

దరఖాస్తులు స్వీకరణ: మే 2నుంచి 20వ తేదీ వరకు

ఉద్యోగార్హతలు: 

అబ్కారీ శాఖలో ఉద్యోగాలకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. 

రవాణాశాఖలో ఉద్యోగాలకు ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 

వయో పరిమితి, రిజర్వేషన్లు: నాలుగు రోజుల క్రితం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారమే.   

దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400.  

పరీక్షా విధానం: 1. ప్రిలిమినరీ రాతపరీక్ష 2. శారీరక దారుఢ్య పరీక్షలు, 3. తుది రాత పరీక్ష. 

ఈ ఉద్యోగాలకు సంబందించి పూర్తి వివరాలకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.cin లో చూడవచ్చు.



Related Post