కొన్ని సినిమాలలో హీరో సినిమా టికెట్స్ మొత్తం కొనేసి థియేటర్లో ఒక్కడే లేదా హీరోయిన్‌తో కలిసి సినిమా చూస్తాడు. అది చూసి జనం ‘అబ్బో...హీరోనా మజాకా...’ అనుకొంటారు. కానీ ఇప్పుడు మీరు కూడా అచ్చం హీరోలాగే హైదరాబాద్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన మినీ హోం థియేటర్‌ను అద్దెకు తీసుకొని మీ భార్యతోనో లేదా ప్రియురాలితోనో కలిసి ఏకాంతంగా సినిమా చూడవచ్చు లేదా కేవలం కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి సినిమా చూడవచ్చు. అదీ...మీరు కోరుకొన్న మీకు నచ్చిన సినిమా...లేదా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటిటీ సినిమాలు కూడా చూడవచ్చు. లేదా మీకు నచ్చిన మ్యూజిక్ ఆల్బమ్ ఎంజాయ్ చేయవచ్చు. లేదా మీ పెళ్లి ఫోటోలు... వీడియోలను చూడవచ్చు. దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే. ఒక షోకు రూ.1,500 నుంచి రూ.1,900 వరకు చెల్లించవలసి ఉంటుంది. నమ్మలేకపోతున్నారా...నిజం!
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో ఈ మినీ థియేటర్ అందుబాటులోకి వచ్చింది. నగరంలో అనేక సినిమా థియేటర్స్ నిర్మించిన స్టార్ ట్రాక్ గ్రూప్ దీనిని నిర్మించి అందుబాటులోకి తెచ్చింది. ఇది సికింద్రాబాద్‌లోని ప్లాట్ నంబర్: 20, ఫేజ్: 2; పైగా హౌసింగ్ కాలనీ, ఎస్పీ రోడ్‌లో ఉంది. ఈ మినీ థియేటర్ ప్రత్యేకతలు ఏమిటంటే...
సుమారు 12 అడుగుల స్క్రీన్, బోష్ సరౌండ్ స్టీరియో సౌండ్, మల్టీప్లెక్స్ థియేటర్ల కంటే గొప్పగా ఉండే ఇంటీరియర్స్, లైటింగ్ సిస్టమ్, ఏడు రిక్లెయినర్స్ (సోఫాలు) ఉన్నాయి. రోజుకి మూడు షోలు ఉంటాయి. ఆన్‌లైన్‌లో టికెట్స్ కాదు... ఏకంగా ఈ థియేటర్‌నే బుక్ చేసుకోవచ్చు. ప్రతీషో ముగిసిన తరువాత ఈ మినీ థియేటర్‌ను పూర్తిగా శానిటైజ్ చేస్తారు. కనుక కుటుంబ సభ్యులతో కలిసి నిర్భయంగా తక్కువ ఖర్చుతోనే నచ్చిన సినిమా చూసేయొచ్చు.
మరింకెందుకు ఆలస్యం... పూర్తి వివరాల కోసం 91 90007 78848 నంబర్‌కి ఫోన్ చేయండి లేదా www.startrackgroup.com వెబ్‌సైట్‌లో చూసి ఈ హోమ్ థియేటర్ బుక్ చేసుకోవచ్చు.