పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే..నిరూపించిన గంగవ్వ

November 13, 2021


img

తెలంగాణలో గంగవ్వ పరిచయమే అక్కరలేని పేరు. నిరుపేద వృద్ధురాలైనప్పటికీ జీవితంలో ఆటుపోటులను చూసి ఏమాత్రం అదరలేదు...బెదరలేదు. తన శక్తి కొద్ది పోరాడుతూ ముందుకు సాగుతూనే ఉంది. అచ్చమైన తెలంగాణ యాసలో కాస్త అమాయకంగా...కాస్త గడుసుగా ఆమె మాట్లాడే మాటలు అందరినీ ఆకట్టుకొంటాయి. అన్నిటికీ మించి ఇంత వయసులో కూడా హుషారుగా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇటువంటి చిన్న చిన్న లక్షణాలే ఆమెకు ఓ ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిందనే జాలితో బహుశః దేవుడు ఆమెకు కొంచెం అదృష్టం కూడా ఇచ్చాడు. అదే...బిగ్‌బాస్ షోలో పాల్గొనడం...ఆ షోకు నాగార్జున హోస్ట్ గా రావడం, ఆయన గంగవ్వ సొంతింటి కలను సాకారం చేయడం! బిగ్‌బాస్ షోలో ఆమె ఎక్కువ కాలం కొనసాగలేకపోయినప్పటికీ ఆమె సొంటింటి కల నెరవేరడమే ఓ గొప్ప బహుమతి అని చెప్పవచ్చు. 


నవంబర్‌8వ తేదీన గంగవ్వ తన కొత్తింట్లో గృహా ప్రవేశం చేసింది. ప్రముఖ నటుడు అక్కినేని అఖిల్ ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని గంగవ్వ ఆశీర్వాదం తీసుకొని ఆమెను అభినందించాడు. ఈ సందర్భంగా గంగవ్వ అక్కినేని నాగార్జునకు, తనకు సాయపడినవారందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తన చిరకాల స్వప్నం నెరవేరినందుకు ఆమె కళ్ళలో సంతోషం తొణికిసలాడుతుంటే ఆమె తన కొత్త  ఇంటిని అందరికీ చూపించింది. గంగవ్వ కొత్త ఇంటిని మీరు చూడండి. 


Related Post