మాకు ప్రజాస్వామ్యం అచ్చిరాదు: ముషారఫ్

October 01, 2016


img

“మా పాలకులు అసమర్ధులు. వారికి దేశాన్ని సరిగ్గా పాలించడం చేతకాదు. అందుకే పాక్ ప్రజలు ఎప్పుడు ఏ సమస్య తలెత్తినా పాక్ ఆర్మీ సహాయం కోసం చూస్తుంటారు. అందుకే మా దేశంలో తరచూ సైనిక తిరుగుబాటులు జరుగుతుంటాయి. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన పాలకుల అసమర్ధత కారణంగా పాక్ సైన్యం ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోక తప్పడం లేదు. వాస్తవానికి పాకిస్తాన్ కి ప్రజాస్వామ్యం అచ్చిరాదు. అందుకు పాకిస్తాన్ లో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఆ పరిస్థితులకి అనుగుణంగా రాజకీయ వ్యవస్థని ఏర్పాటుచేయవలసి ఉంది. కానీ కాలేదు. అందుకే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాలనలో సైన్యం కలుగకజేసుకోవలసి వస్తోంది. ఇది మా వారసత్వ బలహీనత లేదా బలం అనుకోవచ్చు. నాకు పాక్ సైన్య విధానాలే రాజ్యాంగంగా భావిస్తాను.” 

ఈ మాటలని ఎవరో అనామకుడో లేదా పాకిస్తాన్ని ద్వేషిస్తున్న వ్యక్తో అని ఉంటే వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోనవసరంలేదు. ఈ మాటలు అన్నది ఒకప్పుడు పాకిస్తాన్ దేశాధ్యక్షుడుగా వ్యవహరించిన జనరల్ పర్వేజ్ ముషారఫ్! అది కూడా పాకిస్తాన్ మీడియాతో కాదు...వాషింగ్టన్ ఐడియాస్ ఫోరం సదస్సులో మాట్లాడుతూ ఇంటి గుట్టుని స్వయంగా బయటపెట్టారు. 

అయితే ఆయన చెప్పిన ఈ రహస్యం అందరికీ ఎప్పటి నుంచో తెలిసినదే. దానికి ఆయన అధికార ముద్ర వేసి దృవీకరించారని చెప్పవచ్చు. 


Related Post