మా ఎన్నికలలో విలన్‌గా మారిన బండ్ల గణేష్

September 06, 2021


img

తెలుగు సినీ పరిశ్రమలో వివాదాస్పద వ్యక్తులలో బండ్ల గణేష్ కూడా ఒకరనే మాట వినిపిస్తుంటుంది. అది నిజమే అని నిరూపించాడు బండ్ల గణేష్. మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్‌ ప్యానల్లో ఉంటూ ఆయన తరపున గట్టిగా ప్రచారం చేసిన బండ్ల గణేష్, నిన్న హటాత్తుగా ఆ ప్యానల్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు...మా ఎన్నికలలో తాను జనరల్ సెక్రెటరీ పదవికి స్వతంత్ర అభ్యర్ద్ధిగా పోటీ చేస్తానని ప్రకటించి ప్రకాష్ రాజ్‌కు మరో షాక్ ఇచ్చారు. జీవితను తమ ప్యానల్లోకి తీసుకురావడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అందుకే బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలని నిర్ణయించుకొన్నానని తెలిపారు. అయితే ప్రకాష్ రాజ్‌తో తనకు ఎటువంటి గొడవలు, ద్వేషం లేదని నేటికీ ఆయాను ఓ మంచి స్నేహితుడిగానే భావిస్తున్నానని బండ్ల గణేష్ చెప్పగా, ప్రకాష్ రాజ్‌ కూడా అంతే హుందాగా స్పందిస్తూ, “ఆయన మానుంచి విడిపోవడం మాకు చాలా బాధ కలిగించింది. కానీ ఆయన దేనికో విడిపోవాలనుకోనారు. అది ఆయన ఇష్టం. మా అందరి ఆలోచనలు, విధానాలు వేరైనా లక్ష్యం ఒకటే...ఇండస్ట్రీ సంక్షేమమే,” అని అన్నారు.  

ఇప్పటికే మా ఎన్నికలలో జరుగుతున్న రాద్దాంతంతో సినీ పరిశ్రమ చాలా నవ్వులపాలవుతోంది. ఇప్పుడు కామెడియన్‌ బండ్ల క్లైమాక్స్ సీన్‌లో ప్రకాష్ రాజ్‌కు విలన్‌గా మారి ఊహించని ట్విస్ట్ ఇచ్చి మా ఎన్నికలను మరింత రక్తి కట్టిస్తున్నాడు. 

  



Related Post