నేనే పిసిసి అధ్యక్షుడినైతే...జగ్గారెడ్డి

June 03, 2021


img

తెలంగాణ పిసిసికి త్వరలో కొత్త అధ్యక్షుడుని నియమించబోతున్నట్లు మీడియాలో వార్తలు రావడంతో ఆ పదవిని ఆశిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెంటనే స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పిసిసి అధ్యక్షుడి నియామకం గురించి మళ్ళీ వార్తలు ఎందుకు మొదలయ్యాయో నాకు తెలీదు కానీ ఆ రేసులో నేను కూడా ఉన్నానని మరోసారి స్పష్టం చేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులలో నేను ఢిల్లీ వెళ్ళి సోనియా, రాహుల్ గాంధీలను కలవలేను కనుక నాకు అవకాశం ఇవ్వాలని మీడియా ద్వారానే వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ పార్టీ అధిష్టానం వేరెవరినైనా నియమించాలనుకొంటే ముందుగా పార్టీలో మావంటి సీనియర్ నేతలతో సంప్రదించి ఎంపిక చేస్తే బాగుంటుంది. మా అధిష్టానం ఒకవేళ అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తికి ఆ పదవి కట్టబెడితే నేను పూర్తి సహకారం అందిస్తాను. అవసరమైయతే రాష్ట్రమంతటా పర్యటించి పార్టీని బలోపేతం చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తాను. అలాకాక అధిష్టానం తనకు నచ్చిన వ్యక్తికి ఆ పదవి కట్టబెడితే నేను నా సంగారెడ్డి నియోజకవర్గానికే పరిమితమవుతాను. మా అధిష్టానం అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తినే నియమిస్తుందని ఆశిస్తున్నాను,” అని అన్నారు.


Related Post