నేడు హైదరాబాద్‌కు ఈటల...ఏం చెపుతారో?

June 03, 2021


img

బిజెపి అగ్రనేతలను కలిసేందుకు ఆదివారం ఢిల్లీ వెళ్ళిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఇవాళ్ళ హైదరాబాద్‌ తిరిగివస్తున్నారు. బిజెపిలో చేరడంపై ఆయన ఢిల్లీలో ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ, ఆయన వారం రోజుల లోపు బిజెపిలో చేరే అవకాశం ఉందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు కనుక ఖాయమనే భావించవచ్చు. బిజెపిలో చేరే విషయంలో ఈటల రాజేందర్‌కు ఇక ఎటువంటి సందేహాలు, సంకోచం లేనట్లయితే అనర్హత వేటు నుంచి తప్పించుకొనేందుకు నేడో రేపో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవచ్చు. ఈటల రాజేందర్‌ ‘బిజెపి కవచం’ ధరించబోతున్నారు కనుక ఇకపై సిఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌ తదితరులపై మరింత ఘాటు విమర్శలు చేయవచ్చు. ఒకవేళ ప్రొఫెసర్ కోదండరాం, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు ఒత్తిడి కారణంగా ఆయన మనసు మార్చుకొంటే పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చినట్లే భావించవచ్చు. ఈటల నేడు హైదరాబాద్‌ తిరిగివస్తున్నారు కనుక ఏమి చెపుతారో ఆయన నోటే విందాం.  



Related Post