చదువు 8వ తరగతి...ఆస్తులు రూ.176.93 కోట్లు!

March 16, 2021


img

ఆయన చదివింది 8వ తరగతి వరకు మాత్రమే కానీ ఆయన ఆస్తులు రూ.176.93 కోట్లు! అవి తాతముత్తాతలు ఇచ్చినవి కావు కష్టపడి సంపాదించుకొన్నవి! ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్‌. ఆయన ఎంఎన్ఎం పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 6వ తేదీన జరుగబోయే శాసనసభ ఎన్నికలలో ఆయన తన పార్టీ తరపున కోయంబత్తూర్ (దక్షిణ) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన వ్యక్తిగత వివరాలను పేర్కొన్నారు. ఆ వివరాలు:

విద్యార్హతలు: 8వ తరగతి 

మొత్తం ఆస్తుల విలువ: రూ.176.93 కోట్లు 

స్థిరాస్తుల విలువ: రూ.131.84 కోట్లు 

చరాస్తుల విలువ: రూ.45.09 కోట్లు 

అప్పులు: రూ. 49.5 కోట్లు

లండన్‌లో ఓ ఇల్లు (రూ.2.50 కోట్లు), లెక్సస్ కారు (రూ.2.7 కోట్లు), బీఎండబ్ల్యూ కారు (కోటి రూపాయలు) ఉన్నాయని కమల్ హాసన్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.


Related Post