రజినీకాంత్ ముందుగానే ప్రకటించేశారు

December 29, 2020


img

రజినీకాంత్ ఈనెల 31వ తేదీన తన కొత్త పార్టీ వివరాలను ప్రకటిస్తానని అభిమానులకు చెప్పారు కానీ రెండు రోజుల ముందే ఆయన ప్రకటించేశారు...తాను ఇప్పట్లో కొత్త పార్టీ పెట్టబోవడం లేదని! ఇటీవల హైదరాబాద్‌లో తమిళసినిమా షూటింగ్ కోసం వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరగడంతో రెండురోజులు ఆసుపత్రిలో గడపవలసివచ్చింది. కనుక ఈ అనారోగ్యాన్ని దేవుడి చేసిన తొలి సూచన భావించి, పార్టీ స్థాపన ఆలోచనను తాత్కాలికంగా విరమించుకొంటున్నాను. చాలా భారమైన హృదయంతో  ఈ నిర్ణయం తీసుకొన్నాను. నా ఈ నిర్ణయం నా అభిమానులకు చాలా బాధ కలిగిస్తుందని నాకు తెలుసు. వారిని నిరాశపరిచినందుకు క్షమాపణలు చెపుతున్నాను... అంటూ మూడు పేజీలు ట్వీట్ చేశారు.     



Related Post