తెలంగాణ బడ్జెట్‌లో ముఖ్యాంశాలు

March 08, 2020


img

ఆదివారం ఉదయం ఆర్ధికమంత్రి హరీష్‌రావు శాసనసభలో తెలంగాణ 2020-21 సం.ల రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు: 

మొత్తం బడ్జెట్‌ విలువ: రూ. 1,82,914 కోట్లు

 పెట్టుబడి వ్యయం రూ. 22,061.18 కోట్లు

 రెవెన్యూ మిగులు రూ. 4,482.18 కోట్లు

 ఆర్థిక లోటు రూ. 33,191.25 కోట్లు

 రెవెన్యూ వ్యయం రూ. 1,38,669.82 కోట్లు

బడ్జెట్‌లో వివిద వర్గాలకు వరాలు:  

మహిళలకు వడ్డీలేని రుణాలు: రూ.1,200 కోట్లు

పాడి రైతులకు: రూ.100 కోట్లు

పంచాయతీల్లో 36 వేల పారిశుద్ధ్య కర్మచారుల వేతనం రూ.8,500 కి పెంపు

దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం: రూ.50 కోట్లు

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్యాభ్యాసం కోసం స్కాలర్‌షిప్‌: రూ.20 లక్షల ఆర్థికసాయం

ఎస్సీ, ఎస్టీ గృహావసరాలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా

మార్కెట్‌ చైర్మన్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు

ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ రుణాలు, మైక్రో ఇరిగేషన్‌ కోసం సబ్సిడీ రెట్టింపు

ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు: రూ.338 కోట్ల పారిశ్రామిక రాయితీలు

ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు రూ. 6లక్షల నష్టపరిహారం

గీత కార్మికుల చెట్టు పన్ను, పాత బాకీలు రద్దు

ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 60 ఏళ్లకు పెంపు

మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకంగా వీ-హబ్‌

సంక్షేమ పధకాలకు కేటాయింపులు: 

అన్ని రకాల పెన్షన్ల కోసం రూ.11,758 కోట్లు

రైతు బంధు పథకానికి రూ.14,000 కోట్లు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రూ.2,650 కోట్లు

ఎస్సీ ప్రత్యేక నిధికి రూ. 16,534.97 కోట్లు

మైనారిటీ సంక్షేమానికి రూ. 1,518.06కోట్లు

ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 9,771.27 కోట్లు

వెనుకబడిన వర్గాల కోసం రూ. 4,356.82 కోట్లు

మత్స్యకారుల సంక్షేమానికి రూ.1,586 కోట్లు

ఎంబీసీల సంక్షేమానికి రూ.500 కోట్లు

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌: రూ.350 కోట్లు

మైనార్టీ సంక్షేమానికి: రూ.1,518 కోట్లు

హరితహారం: రూ.791 కోట్లు

విత్తనాల సబ్సిడీ: రూ.142 కోట్లు

సంపూర్ణ అక్షరాస్యత కోసం రూ.100 కోట్లు

శాఖలవారీగా కేటాయింపులు:  

పంచాయతీరాజ్‌ శాఖ:  రూ. 23,500 కోట్లు

మున్సిపల్‌ శాఖ: రూ.14,809 కోట్లు

సాగునీటి రంగం: రూ.11,054 కోట్లు

విద్యుత్‌ శాఖ: రూ.10,416 కోట్లు 

చిన్న నీటిపారుదలశాఖ: రూ.600 కోట్లు

పాఠశాల విద్య: రూ. 10,421 కోట్లు

ఉన్నత విద్య: రూ.1,723 కోట్లు

గృహ నిర్మాణం: రూ.11,917 కోట్లు

పారిశ్రామిక అభివృద్ధి: రూ.1,998 కోట్లు

పోలీస్‌శాఖ: రూ.5,852 కోట్లు

వైద్యరంగం: రూ.6,186 కోట్లు 

ఆర్‌అండ్‌బీ: రూ.3,494 కోట్లు

ఆర్టీసీకి రూ.1000 కోట్లు

అటవీశాఖ: రూ.791 కోట్లు 

అభివృద్ధి పనులకు కేటాయింపులు: 

మూసీ రివర్‌ ప్రాజెక్ట్‌: రూ.10,000 కోట్లు

మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌కు రూ.1,000 కోట్లు

పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నిర్మాణానికి రూ. 550 కోట్లు 

గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి: రూ.600 కోట్లు 

దేవాలయాల అభివృద్ధికి: రూ.500 కోట్లు 

నియోజకవర్గాల అభివృద్ధికి: రూ.480 కోట్లు

రైతు వేదిక నిర్మాణానికి రూ.300 కోట్లు


Related Post