గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతల సమావేశం

February 29, 2020


img

త్వరలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి కనుక వాటిలో లేవనెత్తవలసిన అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు శనివారం ఉదయం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ఫిరాయింపుల తరువాత ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మిగిలారు. వారిలో మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సుమారు ఏడాది క్రిందట బిజెపిలో చేరేందుకు సిద్దపడినప్పటికీ ఇంతవరకు చేరలేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగానే ఉంటున్నారు. కనుక ఆయనను పక్కన పెడితే పార్టీలో ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్లవుతుంది. కాంగ్రెస్‌ తరపున వారు ఐదుగురు మాత్రమే అసెంబ్లీ సమావేశాలలో పాల్గొని ప్రజాసమస్యలపై మాట్లాడే అవకాశం ఉంది. కానీ వారిలో నలుగురు ఎమ్మెల్యేలు.. శ్రీధర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీరయ్య, సీతక్క ఈరోజు గాంధీభవన్‌లో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డిలు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఆ ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో 104 మంది ఎమ్మెల్యేలు, మరో ఏడుగురు మజ్లీస్ ఎమ్మెల్యేలు మద్దతున్న టిఆర్ఎస్‌ సర్కారును ఎదుర్కోగలరా?అంటే అనుమానమే.


Related Post