విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డు

February 29, 2020


img

విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ, తెలంగాణ జిల్లాలలో కలిపి 2014, మార్చి 23న అత్యధికంగా 13,162 యూనిట్లు విద్యుత్ వినియోగం నమోదు అవగా, ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఇంకా వేసవికాలం మొదలవక మునుపే శుక్రవారం 13,168 యూనిట్లు విద్యుత్ వినియోగమైంది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్ ఉత్పత్తి, డిమాండ్‌, సరఫరాల మద్య తీవ్ర వ్యత్యాసం ఉండటంతో రోజూ విద్యుత్ కోతలు, పరిశ్రమలకు పవర్ హాలీడేలుండేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న అనేక చర్యల వలన రాష్ట్రం ఏర్పడిన కొన్ని నెలలకే ఆ సమస్యలను అధిగమించగలిగింది. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం కంటే కూడా ఎక్కువగా తెలంగాణలో విద్యుత్ డిమాండ్, వినియోగం జరుగుతున్నప్పటికీ విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతోంది. అంతేకాక రాష్ట్రంలో వ్యయసాయరంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందజేస్తోంది. మరోపక్క కాళేశ్వరం ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన బాహుబలి మోటర్లు, పంపు హౌసులకు కూడా నిరంతరాయంగా విద్యుత్ అందించగలుగుతోంది. 

గత ఏడాది ఫిబ్రవరి 28న తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 9,770 మెగావాట్స్  విద్యుత్ డిమాండ్ ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరి 28న దానికి 34 శాతం అదనంగా నమోదు అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు 132.6 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగింది. 2014-2020  విద్యుత్ వినియోగం, డిమాండ్ వివరాలు...  

 

2014

2020

రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లు

1,11,19,990

1,54,14,451

వ్యవసాయ కనెక్షన్లు

19,02,754

24,31,056

విద్యుత్ డిమాండ్

5,661 మెగావాట్లు

13,168మెగావాట్లు

ఎత్తిపోతల పధకాలకు

680 మెగావాట్లు

2,200 మెగావాట్లు

తలసరి వినియోగం

1,358 యూనిట్లు

1,896 యూనిట్లు

మొత్తం వినియోగం

47,338 మిలియన్ యూనిట్లు

68,147 మిలియన్ యూనిట్లు



Related Post