అసెంబ్లీ సీట్ల పెంపుపై కిషన్‌రెడ్డి ప్రకటన

February 28, 2020


img

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచుతామనే హామీని చేర్చారు. కానీ ఆ తరువాత అధికారంలోకి వచ్చిన మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దానిపై కొంత కసరత్తు చేయడంతో డిసెంబర్ 2018 అసెంబ్లీ ఎన్నికలనాటికి అది అమలవుతుందని సిఎం కేసీఆర్‌ కూడా భావించారు. కానీ కేంద్రప్రభుత్వం ఆ ప్రస్తావనే చేయలేదు. ఆ తరువాత మళ్ళీ ఇన్ని రోజులకు దానిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడారు. “యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో ఆచరణసాధ్యం కానీ అనేక అంశాలను, హామీలను జొప్పించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచుతామనే హామీ వాటిలో ఒకటి. అయితే ప్రస్తుతం కేంద్రప్రభుత్వం అటువంటి ఆలోచన ఏదీ చేయడం లేదు. దేశంలో అన్ని రాష్ట్రాలకు పెంచినప్పుడే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా పెరుగుతాయి. అది ఎప్పుడనేది కేంద్ర న్యాయశాఖే నిర్ణయిస్తుంది,” అని కిషన్‌రెడ్డి అన్నారు.  



Related Post