మోతెరా స్టేడియంలో ట్రంప్ స్పీచ్... హైలైట్స్

February 24, 2020


img

అహ్మదాబాద్‌లో నిర్మించిన ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ పేరిట తనకు స్వాగతం పలకడానికి వచ్చిన సుమారు లక్షకుపైగా జనాలను చూసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఉబ్బితబ్బిబైయ్యారు. ముందుగా ట్రంప్-మోడీలు చేతులు కలిపి వారికి అభివాదం చేశారు. అనంతరం మొదట అమెరికా తరువాత భారత్‌ జాతీయగీతాలాపన జరిగింది. 

ముందుగా ప్రధాని నరేంద్రమోడీ ‘నమస్తే ట్రంప్‌’ అంటూ ప్రసంగం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, వారి కుటుంబ సభ్యులను ప్రశంశల వర్షం కురిపించారు. 130 కోట్ల మంది భారతీయుల తరపున అహ్మదాబాద్‌ ప్రజలు ట్రంప్ కుటుంబానికి సాధారంగా ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు. ప్రపంచంలో రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్‌, అమెరికాల మద్య దశాబ్ధాలుగా దృడమైన బంధాలు నెలకొని ఉన్నాయని ట్రంప్ భారత్‌ పర్యటనతో ఆ బంధం ఇంకా బలపడుతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ హిందీలో ప్రసంగిస్తున్నప్పుడు, వేదికపైనే ఉన్న ట్రంప్ దంపతులకు అర్ధమయ్యేందుకు ఇంగ్లీషులోకి అనువదించేవారు లేకపోవడం ఆశ్చర్యకరమే. కనుక ప్రధాని మోడీ ప్రసంగిస్తున్నంతసేపు ట్రంప్ దంపతులకు అర్ధాంకాకపోయినా చిర్నవ్వులు చిందిస్తూ అందరూ చప్పట్లు కొట్టినప్పుడు వారు కూడా చప్పట్లుకొడుతూ కాలక్షేపం చేశారు. 

అనంతరం ట్రంప్ ఇంగ్లీషులో ప్రసంగిస్తూ, భారత్ గొప్పదనం గురించి వివరిస్తూ మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ ఇదే నగరంలో ఒకప్పుడు ఛాయ్ అమ్ముకొనేవారని తన తెలివితేటలతో ఈ స్థాయికి ఎదిగారని ట్రంప్ అన్నారు. వరుసగా రెండుసార్లు ఎన్నికలలో గెలిచి ప్రధానమంత్రి పదవి చేపట్టిన మోడీని తక్కువగా అంచనావేయలేమని, ఆయన గొప్ప వ్యవహారదక్షుడని ట్రంప్ పొగిడారు.

రేపు డిల్లీలో భారత్‌-అమెరికాల మద్య 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలు చేసుకోబోతున్నామని మోతే స్టేడియంలోనే ట్రంప్ ప్రకటించడం ఆశ్చర్యకరమే. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌కు అత్యాధునికమైన యుద్దవిమానాలు, ఆయుధాలు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా భారత్‌-అమెరికాల మద్య వాణిజ్యపరమైన ఇబ్బందుల గురించి కూడా ట్రంప్ క్లుప్తంగా మాట్లాడుతూ “రేపు డిల్లీలో దీనిపై చర్చలు జరుగబోతున్నాయి. కానీ అవి చాలా టఫ్ గా ఉండబోతున్నాయి,” అని అన్నారు.         


భారత్‌ అన్నా... నరేంద్రమోడీ అన్నా తమకు చాలా అభిమానమని అందుకే 8,000 కిమీ దూరం ప్రయాణించి భారత్‌ పర్యటనకు వచ్చామని ట్రంప్ అన్నారు. చెడుపై మంచి విజయాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచించే దీపావళి, హోలీ వంటి పండుగలు భారతీయులు జరుపుకొంటూ తమ దేశం గొప్పదనాన్ని లోకానికి చాటిచెపుతున్నారని అన్నారు. భారత్‌లో అనేక మతాలు, వేషభాషలు, సంస్కృతీ సంప్రదాయాలున్నప్పటికీ 130 కోట్లు మంది కలిసిమెలిసి జీవిస్తున్నారని ట్రంప్ ప్రశంశించారు.    

ట్రంప్ ప్రసంగంలో మహాత్మాగాంధీ, స్వామి వివేకానంద, సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ వంటి మహనీయులు పుట్టిన గడ్డ భారత్‌ అని ప్రశంశించారు. 70 సం.లలో భారత్‌ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి అగ్రదేశాలతో పోటీపడే స్థాయికి ఎదిగిందన్నారు. మోడీ నాయకత్వంలో దేశంలో మారుమూల గ్రామాలకు కూడా శరవేగంగా మౌలికవసతుల కల్పన జరుగుతోందన్నారు. మరో 10 ఏళ్ళలో భారత్‌ పేదరికం నుంచి పూర్తిగా బయటపడుతుందనే నమ్మకం తనకుందన్నారు డొనాల్డ్ ట్రంప్.


Related Post