తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు

February 07, 2020


img

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు గురువారం లోక్‌సభలో చర్చ జరుగుతున్నప్పుడు జమ్ముకశ్మీర్‌ విభజన, ఆర్టికల్ 372 రద్దుపై కాంగ్రెస్‌ సభ్యులు చేసిన ఆరోపణలకు ప్రధాని నరేంద్రమోడీ జవాబిస్తూ, “ఆనాడు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలను ఎటువంటి వివాదం లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా విభజించారు. కానీ మీ కాంగ్రెస్‌ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఏవిధంగా విభజించారో మీకు తెలియదా? పార్లమెంటు తలుపులు, కిటికీలు మూసి రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించిన సంగతి మీరు మరిచిపోవచ్చునేమో కానీ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ప్రధాని నరేంద్రమోడీ ఉద్దేశ్యం కాంగ్రెస్ పార్టీకి జవాబు చెప్పడమే అయినప్పటికీ, మద్యలో తెలంగాణ ఏర్పాటు చేసిన విధానం, అందుకు యూపీఏ ప్రభుత్వం అనుసరించిన వైఖరి రెండూ సరికావని నొక్కి చెప్పినట్లవడంతో తెలంగాణ నేతలకు, ప్రజలకు బాధ కలిగించవచ్చు. పార్లమెంటులో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.


Related Post