హైదరాబాద్‌వాసులకు ఓ శుభవార్త

February 04, 2020


img

హైదరాబాద్‌వాసులకు ఓ శుభవార్త! ఈనెల 7వ తేదీ నుంచి ఎంజీబీఎస్ (మహాత్మాగాంధీ బస్ స్టేషన్)-జేబీఎస్(జూబ్లీ బస్ స్టేషన్) మద్య మెట్రో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సిఎం కేసీఆర్‌ స్వయంగా మెట్రో సర్వీసులకు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. 11 కిమీ పొడవుండే ఈ ఎంజీబీఎస్-జేబీఎస్ మెట్రో కారిడార్‌లో పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్‌ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ కలిపి మొత్తం 9 మెట్రో స్టేషన్లున్నాయి. ఈ కారిడార్‌ కూడా అందుబాటులోకి రావడంతో నగరంలో మొత్తం 69కిమీ పొడవునా మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ప్రస్తుతం నగరంలో అన్ని మెట్రో కారిడార్‌లలో కలిపి సగటున రోజుకు 2.30  లక్షలమందికి పైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం  ఇప్పుడు నగరం మద్యగా ప్రధానప్రాంతాలను కలుపుతూ సాగే ఈ కారిడార్‌లో కూడా మెట్రో సర్వీసులు ప్రారంభమైనట్లయితే రోజువారీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.  



Related Post