నేను పార్టీ మారడం లేదు: జూపల్లి

February 03, 2020


img

మాజీ మంత్రి, టిఆర్ఎస్‌ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నేను పార్టీ మారడం లేదు. కానీ కొందరు గిట్టనివాళ్ళు నేను పార్టీ మారబోతున్నానంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. మాలో మాకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ మేమంత టిఆర్ఎస్‌ కుటుంబ సభ్యులమే. కనుక ఎవరితోనో విభేదమున్నంత మాత్రన్న పార్టీని వీడవలసిన అవసరం లేదు. కేసీఆర్‌ నాయకత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని నేను బలంగా నమ్ముతున్నాను. కనుక నేను ఎప్పటికీ కేసీఆర్‌ న్యాకత్వంలోనే పనిచేస్తాను. తెలంగాణ సాధన కోసం మంత్రి పదవినే వదులుకొన్నవాడిని ఇప్పుడు పార్టీ మారవలసిన అవసరం నాకేమిటి?నేను ఎప్పటికీ టిఆర్ఎస్‌లోనే కొనసాగుతాను,” అని అన్నారు.  

మునిసిపల్ ఎన్నికలలో తన అనుచరులకు పార్టీ టికెట్లు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన జూపల్లి నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మునిసిపాలిటీలోని 20 వార్డులలో తన అభ్యర్ధులను నెలబెట్టడమే కాక వారి తరపున ఎన్నికల ప్రచారం కూడా చేశారు. దాంతో టిఆర్ఎస్‌ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. దాంతో ఆయన పార్టీ వీడుతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆయన హైదరాబాద్‌ వెళ్ళి కేటీఆర్‌తో భేటీ అయ్యి సంజాయిషీ ఇచ్చుకొన్నారు. దాంతో ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనుక జూపల్లి టిఆర్ఎస్‌లోనే కొనసాగుతారని స్పష్టం అయ్యింది. అదే.. ఇవాళ్ళ ఆయన చెప్పారనుకోవచ్చు.


Related Post