క్రెడాయ్ ప్రాపర్టీషోలో కేటీఆర్‌ స్పూర్తిదాయకమైన ప్రసంగం

January 31, 2020


img

హైదరాబాద్‌ నగరంలో మాధాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేటి నుంచి క్రెడాయ్ క్రెడాయ్ ప్రాపర్టీషో ప్రారంభం అయ్యింది. రాష్ట్రంలో పలుప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ షోలో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మునిసిపల్ శాఖమంత్రి కేటీఆర్‌ ఈ షోలో పాల్గొన్న క్రెడాయ్ సభ్యులను, నిర్మాణ సంస్థల యజమానులను ఉద్దేశ్యించి చేసిన ప్రసంగం చాలా స్పూర్తిదాయకంగా ఉంది. 

“దేశంలో శరవేగంగా ఎదుగుతున్న నగరాలలో హైదరాబాద్‌ కూడా ఒకటి. ఈ అభివృద్ధిలో క్రెడాయ్ కూడా భాగస్వామిగా ఉండటం చాలా సంతోషం కలిగిస్తోంది. అందరం కలిసి హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడంతోపాటు అత్యంత నివాసయోగ్యమైన నగరంగా మలుచుకొనే బాధ్యత కూడా మనపైనే ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ కొన్ని సూచనలు చేస్తున్నాను. నేటికీ మన రాష్ట్రం నుంచి వేలాది మంది ప్లంబర్లు, కార్పెంటర్లు, తాపీ మేస్త్రులు, ఎలక్ట్రీషియన్లు తదితర భవననిర్మాణ కార్మికులు, ఇంజనీర్లు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారు. రాష్ట్రంలో... హైదరాబాద్‌లో ఇన్ని ఉద్యోగ, ఉపాది అవకాశాలు ఉండగా అంతా దూరంపోవడం ఎందుకు? ఈరోజుల్లో నెలకు రూ.20-30,000 జీతం ఇక్కడే సంపాదించుకోవచ్చు. అలాగే గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న మన యువ ఇంజనీర్లను వెనక్కు రప్పించి ఇక్కడ నిర్మాణసంస్థలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. త్వరలోనే సిఎం కేసీఆర్‌ ఇదే పని మీద గల్ఫ్ దేశాలలో పర్యటించనున్నారు. ఆవిధంగా ముందుకువచ్చేవారికి ప్రభుత్వం అన్నివిధాల సహాయసహకారాలు అందించడానికి సిద్దంగా ఉంది. కనుక మీరు కూడా వారికి సహకరించినట్లయితే నిర్మాణరంగంలో కూడా యువతరం ప్రవేశిస్తుంది. వారు కూడా అనేకమందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేస్థాయికి ఎదుగుతారు,” అని అన్నారు.  


Related Post