కరీంనగర్‌లో టిఆర్ఎస్ జెండా ఎగురవేస్తుందా?

January 27, 2020


img

కరీంనగర్‌ మునిసిపల్ కార్పోరేషన్‌ ఎన్నికలు అనివార్య కారణాల వలన రెండు రోజులు ఆలస్యంగా జరుగడంతో ఓట్ల లెక్కింపు కూడా రెండు రోజులు ఆలస్యంగా ఇవాళ్ళ ఉదయం ప్రారంభం అయ్యింది. పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 7 గంటలకు ప్రారంభం అయ్యింది. 

కరీంనగర్‌ కార్పోరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా వాటిలో 20,37 డివిజన్లలో టిఆర్ఎస్‌ అభ్యర్ధులు తుల రాజేశ్వరి, చల్లా స్వరూపారాణిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కనుక మిగిలిన 58 డివిజన్లలో ఓట్లను లెక్కిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికలలో బిజెపి అభ్యర్ది బండి సంజయ్ కుమార్  గెలుపొందినప్పటి నుంచి కరీంనగర్‌పై పట్టుసాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కనుక మునిసిపల్ కార్పోరేషన్‌ ఎన్నికలలో బిజెపిని గెలిపించుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. అయితే మునిసిపల్ కార్పోరేషన్‌ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను గెలిపించుకొని లోక్‌సభ ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఓటమికి బిజెపిపై ప్రతీకారం తీర్చుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక కరీంనగర్‌ మునిసిపల్ కార్పోరేషన్‌ను టిఆర్ఎస్‌, బిజెపిలలో ఏది గెలుచుకోబోతోందో ఈరోజు సాయంత్రానికి తేలిపోతుంది. మునిసిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్‌ ప్రభంజనం స్పష్టంగా కనిపించినందున కరీంనగర్‌లో కూడా టిఆర్ఎస్‌ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


Related Post