కనబడని పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం!

January 16, 2020


img

రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ సమూలంగా తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీనియర్ నేత తులసిరెడ్డి మాత్రమే అప్పుడప్పుడు టీవీలలో కనబడుతుంటారు. ప్రస్తుతం ఏపీలో బలమైన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ రాజధాని తరలింపు నిర్ణయం కారణంగా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ పరిస్థితులను సానుకూలంగా మలుచుకొని రాష్ట్రంలో బలపడేందుకు బిజెపి-జనసేన పార్టీలు ఇవాళ్ళే చేతులు కలిపాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం చలనం కనిపించడం లేదు. కనుక రాష్ట్రంలో కనబడని ఆ పార్టీకి కాంగ్రెస్‌ అధిష్టానం ఇవాళ్ళ కొత్త అధ్యక్షుడిని నియమించింది. మాజీ మంత్రి శైలజానాథ్‌కు పార్టీ పగ్గాలు అప్పగించింది. సీనియర్ నేతలు తులసిరెడ్డి, మస్తాన్ వలీలను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఏపీలో ఎంతో బలంగా ఉన్న టిడిపియే వైసీపీ ధాటికి తట్టుకోలేక విలవిలలాడుతుంటే, శైలజానాథ్‌, తులసిరెడ్డి, మస్తాన్ వలీ ముగ్గురూ కలిసి ఏపీలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించగలరా? చూడాలి.     



Related Post