నిరసన ర్యాలీలో నేలపై జాతీయజెండాలు

January 10, 2020


img

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా నేడు హైదరాబాద్‌లో ముస్లిం యునైటెడ్ యాక్షన్ కమిటీ అధ్వర్యంలో జరిగిన ర్యాలీలో జాతీయజెండాకు అపచారం జరిగింది. నగరం నలుమూలల నుంచి వచ్చిన వేలాది ముస్లింలు జాతీయజెండాలను చేతబట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. సాయంత్రం నమాజ్ సమయం అవడంతో అందరూ రోడ్లపైనే నమాజ్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అందరూ జాతీయజెండాలను రోడ్డుపై ఉంచి నమాజ్ చేశారు. 

రాజ్యాంగంలోని ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ కోడ్ సెక్షన్ 3లోని 20వ నిబందన ప్రకారం జాతీయజెండాను నేలపై కానీ నీళ్ళపై గానీ ఉంచరాదు. కానీ ఈరోజు ర్యాలీలో పాల్గొన్నవారు జాతీయజెండాను వాహనాలు తిరిగే నడిరోడ్డుపై ఉంచారు. ర్యాలీకి బందోబస్తుగా ఉన్న పోలీసులు, పోలీస్ ఉన్నతాధికారుల కళ్లెదుటే జాతీయజెండాకు ఇంత అపచారం జరుగుతున్నా ఎవరూ వారిని వారించలేదు. కనీసం వారి చేతుల్లో నుంచి జెండాలను తీసుకొని పట్టుకొనే ప్రయత్నం చేయలేదు. అసలు పోలీస్ అధికారులు ఎవరూ ఇంతవరకు ఈ తప్పిదాన్ని గుర్తించినట్లు కూడా లేదు..లేదా గుర్తించినా గుర్తించనట్లు మిన్నకుండిపోయారో తెలియదు.

 

ఇప్పుడు చిన్నా పెద్ద ఆందోళనలో జాతీయజెండాలు చేతపట్టుకొని ర్యాలీ చేయడం పరిపాటిగా మారింది. తద్వారా ప్రజలు తమ దేశభక్తిని చాటుకోవాలనుకోవడం మంచిదే. కానీ సమున్నతంగా ఎగురవలసిన జాతీయజెండాను ఇలా నలుగురు నడిచే, వాహనాలు తిరిగే రోడ్డుపై పెట్టడం చాలా తప్పు. 

దేశభక్తిని నిరూపించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. దాని కోసం జాతీయజెండాను పట్టుకొని తిరుగనవసరం లేదు. తిరిగినా పరువాలేదు కానీ దానిని ఈవిధంగా అగౌరవించకుండా ఉంటే మంచిది. కనీసం ఇప్పటికైనా ఆందోళనకారులు, ముఖ్యంగా పోలీస్ అధికారులు మళ్ళీ ఇటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకొంటే మంచిది.


Related Post