జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు

January 09, 2020


img

 జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11వరకు ఒకసారి, మళ్ళీ మార్చి 2 నుంచి ఏప్రిల్ 3వరకు మరోసారి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయించింది. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2020-2021 ఆర్ధిక సంవత్సరాలకు బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు. దానిపై ఉభయసభలలో చర్చలు జరిపిన తరువాత ఫిబ్రవరి 11న సమావేశాలు వాయిదా పడతాయి. మళ్ళీ సమావేశాలు మొదలయ్యేలోపుగా వివిద శాఖల కేటాయింపులపై పార్లమెంటరీ కమిటీలు సమీక్షిస్తాయి. మార్చి 2 నుంచి ఏప్రిల్ 3వరకు జరుగబోయే బడ్జెట్‌ సమావేశాలలో కేటాయింపులపై చర్చించి బడ్జెట్‌ను ఆమోదిస్తారు. కేంద్రప్రభుత్వ కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బడ్జెట్‌ రూపొందించుకొంటాయి. 



Related Post