మజ్లీస్ ర్యాలీని పోలీసులు అనుమతిస్తారా?

January 07, 2020


img

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్)లను వ్యతిరేకిస్తూ ఈనెల 10న మజ్లీస్ అధ్యర్యంలో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. 

సీఏఏను తెరాస, కాంగ్రెస్‌, మజ్లీస్ మూడు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే వాటిని వ్యతిరేకిస్తూ మజ్లీస్ నిర్వహించే సభలు, ర్యాలీలకు అనుమతిస్తున్న తెరాస సర్కార్‌ కాంగ్రెస్‌ సభలు, ర్యాలీలకు అనుమతించడంలేదు. మూడు పార్టీల లక్ష్యం ఒకటే అయినప్పుడు మళ్ళీ ఈ ద్వంద విధానాలు ఎందుకు? అంటే ఈ సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పిఆర్‌లతో అన్ని పార్టీలు ఎంతో కొంత రాజకీయ మైలేజీ పొందాలని ఆశపడుతుండటమే కారణంగా కనిపిస్తోంది. 

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల గంట మ్రోగినందున, ఈ మూడిటితో రాష్ట్రంలో ముస్లింలను ఆకట్టుకోవాలని మజ్లీస్, కాంగ్రెస్ పార్టీలు ఆశపడుతున్నాయి. వాటిలో మజ్లీస్ పార్టీ తెరాసకు మిత్రపక్షంగా ఉంది కనుక ఈ ఆందోళనల వలన దానికీ..దాని ద్వారా తెరాసకు మాత్రమే లబ్ది కలగాలని తెరాస ఆశపడటం సహజమే. అందుకే మజ్లీస్ సభలు, ర్యాలీలకు అనుమతిస్తూ కాంగ్రెస్‌ సభలకు అనుమతి నిరాకరిస్తోందని భావించవచ్చు. కనుక మున్సిపల్ ఎన్నికలకు ముందు జనవరి 10న మజ్లీస్ అధ్వర్యంలో జరుగబోయే ర్యాలీకి అనుమతించవచ్చు.


Related Post