త్వరలో భారత్‌లోకి చైనా కార్లు

January 04, 2020


img

ఆర్ధిక మాంద్యం కారణంగా ఇప్పటికే నష్టాలలో మునిగిపోతున్న దేశీయ కార్ల తయారీ కంపెనీలకు త్వరలో మరో పెద్ద కష్టం రాబోతోంది. చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్ కంపెనీ త్వరలో తన ఆరా ఆర్‌-1 విద్యుత్ కార్లను భారత్‌లో ప్రవేశపెట్టబోతోంది. అయితే చైనా కార్లు భారత్‌లో దిగడం సమస్య కాదు. చైనా మొబైల్స్ లాగే చైనా విద్యుత్ కార్లు కూడా చవుకధరలో అమ్మబోవడమే సమస్యగా మారబోతోంది.

మన దేశంలో విద్యుత్ కార్ల ధర సగటున సుమారు రూ.13 లక్షలుంటే, చైనా దించబోతున్న ఆరా ఆర్‌-1 విద్యుత్ కార్ల ధర సుమారు రూ.6.2 నుంచి 8 లక్షలలోపు ఉండవచ్చునని ఆ సంస్థ తెలిపింది. అప్పుడు సహజంగానే ప్రజలు చైనా కార్లవైపే మొగ్గు చూపుతారు. కనుక దేశీయ కార్ల తయారీ సంస్థలకు పెద్ద దెబ్బ అవుతుంది.

చైనా మొబైల్స్ వచ్చిన తరువాత దేశీయ మొబైల్ కంపెనీలు ఏవిధంగా నష్టాలలో కూరుకుపోయి మూతపడ్డాయో అదేవిధంగా దేశీయకార్ల కంపెనీలు కూడా మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఆదేజరిగితే వాటిలో పనిచేస్తున్న వేలాదిమండి ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవైపు ఆర్ధికమాంధ్యంతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూ ఇప్పుడిప్పుడే విద్యుత్ కార్ల తయారీవైపు మళ్ళుతున్న దేశీయకార్ల కంపెనీలకు ఈ చైనా సరుకును అనుమతించి కేంద్రప్రభుత్వం ఎందుకు షాక్ ఇస్తోందో?


Related Post