ఎన్నికలకు తెరాస సిద్దమే మరి ప్రతిపక్షాలో?

December 30, 2019


img

తెరాస ఎప్పుడూ ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్దంగానే ఉంటుంది. కనుక మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించేసింది. కాంగ్రెస్‌, బిజెపిలు కూడా  పరస్పరం విమర్శించుకొంటూ, తెరాసను కూడా విమర్శిస్తూ ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇదివరకు బిజెపి విమర్శలను పెద్దగా పట్టించుకోని తెరాస ఇప్పుడు ఘాటుగా ప్రతివిమర్శలు చేస్తుండటంతో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకొంటోంది. 

ఈసారి మున్సిపల్ ఎన్నికలలో స్థానిక అంశాలకంటే సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపైనే ప్రధానంగా మూడు పార్టీల మద్య యుద్ధం జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్‌, తెరాసలు రెండూ వాటిని వ్యతిరేకిస్తున్నాయి. తద్వారా రాష్ట్రంలో ముస్లింలను ఆకర్షించవచ్చని భావిస్తున్నాయి. కనుక ఆ రెండు పార్టీలు ఇదే అంశాన్ని హైలైట్ చేసేందుకు ప్రయత్నించవచ్చు. ఇప్పటికే వాటితో బిజెపి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది కనుక అది రాష్ట్రంలో సమస్యలు, హామీల అమలులో తెరాస వైఫల్యాలు, తెరాస-మజ్లీస్ దోస్తీ వంటి అంశాలతో తెరాసను డ్డీకొనే ప్రయత్నం చేయవచ్చు. నాయకత్వ సమస్యతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం బిజెపికి పెద్ద కష్టమేమీ కాదు. అలాగే కాంగ్రెస్‌, బిజెపిలను ఎదుర్కోవడం తెరాసకు పెద్ద కష్టమేమీ కాదు. కనుక అంతిమంగా తెరాసదే పైచెయ్యి సాధించడం ఖాయంగానే కనిపిస్తోంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ 2వ, బిజెపి 3వ స్థానంలో నిలువవచ్చు.


Related Post