తెలంగాణ ప్రభుత్వ కొత్త సీఎస్ ఎవరో?

December 25, 2019


img

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర జోషి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. కనుక ఆయన స్థానంలో ఎవరు నియమింపబడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీనియారిటీ ప్రకారం చూసినట్లయితే చాలా మంది ఐఏఎస్‌ అధికారులున్నారు. కానీ సిఎం కేసీఆర్‌ ఆశయాలు, నిర్ణయాలకు అనుగుణంగా చురుకుగా పనిచేస్తున్నవారిలో ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌. వారిలో ఎవరో ఒకరికి ఈ కీలక పదవి దక్కవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  

వారిరువురిలో అజయ్ మిశ్రా జూన్ 2020, సోమేష్ కుమార్ 2023లో పదవీవిరమణ చేయనున్నారు. ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మారకూడదని సిఎం కేసీఆర్‌ భావిస్తే సోమేష్ కుమార్‌కు అవకాశం లభించవచ్చు. అజయ్ మిశ్రా పట్ల కూడా సిఎం కేసీఆర్‌కు మంచి అభిప్రాయం ఉంది కనుక ఆయనకే ఈ అవకాశం ఇచ్చినా ఈయవచ్చు. ఒకటి రెండు రోజులలోనే కొత్త సీఎస్ ఎవరనే దానిపై స్పష్టత వస్తుంది. 



Related Post