వారికి మానవహక్కులు వర్తించవు: విజయశాంతి

December 06, 2019


img

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సీనియర్ కాంగ్రెస్‌ నేత, ప్రముఖ నటి విజయశాంతి ఘాటుగా స్పందించారు. “మానవత్వాన్ని మంటగలిపిన వారికీ మానవహక్కులు వర్తించవు. వారు అందుకు అర్హులు కారు కూడా. కనుక దిశ కేసులో నలుగురు నిందితులకు సరైన శిక్ష పడిందని భావిస్తున్నాను. అయితే రాష్ట్రంలో మళ్ళీ ఇటువంటి అత్యాచారాలు, విషాదఘటనలు, ఎన్‌కౌంటర్లు జరుగకుండా మహిళలకు పూర్తి రక్షణ కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కనుక రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా తిరిగేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను,” అని ఈ ఘటనపై సోషల్ మీడియా ద్వారా తన స్పందనను తెలియజేశారు.

మరో ప్రముఖ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని గట్టిగా సమర్ధించారు. “దిశను అతి కిరాతకంగా హత్య చేసిన వారికి సరైన శిక్షే పడింది. ఇటువంటి హేయమైన నేరాలకు పాల్పడేవారికి ఇటువంటి శిక్షలే సరైనవి. అప్పుడే మరెవరూ ఇటువంటి నేరాలు చేసేందుకు భయపడతారు. ఏపీలో కూడా కటిన శిక్షలు విధించేలా చట్టాలను రూపొందిస్తున్నాము. త్వరలోనే అవి అమలులోకి తీసుకువస్తాము. ఈ ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మ శాంతిస్తుందని భావిస్తున్నాను,” అని రోజా అన్నారు. 



Related Post