ఆర్టీసీతో ప్రైవేట్ కూడా పోటీ?

December 03, 2019


img

తెలంగాణ రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీలు బారీగా పెరిగాయి. మామూలుగానే ఆర్టీసీ కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు ఇప్పుడు ఈ వంకతో ఛార్జీలు మరింత పెంచడం ఖాయం. సిటీ బస్సుల ఛార్జీలు పెరిగినందున ఆటోలు, మినీ వ్యాన్, క్యాబ్‌ ఛార్జీలు కూడా పెంచడం ఖాయం. అన్ని రకాల రవాణాఛార్జీలు పెరిగినట్లయితే కూరలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడం ఖాయం. మరోపక్క మొబైల్ ఫోన్‌ ఛార్జీలు కూడా బారీగా పెరగనున్నాయి. కనుక ప్రజలపై ఒకేసారి చాలా భారం పడుతోంది. కానీ భరించకతప్పదు.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరా భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. అంటే పరోక్షంగా ఆ భారం కూడా రాష్ట్ర ప్రజలపైనే పడుతోందని భావించవచ్చు. కానీ ఇంతవరకు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు కనుక ప్రజలకు ఆ భారం తెలియడం లేదు కానీ రానున్న రోజులలో తప్పకుండా విద్యుత్ ఛార్జీలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక మద్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ముందుగానే జాగ్రత్తపడటం మంచిది. 



Related Post