శివసేనకు ఆయన గుదిబండగా మారనున్నారా?

November 27, 2019


img

శివసేన రేపు కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. దానిలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఆ పార్టీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ బిజెపి పంచన చేరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయనపై అవినీతి కేసుల ప్రస్తావన వినిపించింది. గతంలో ఆయన మహారాష్ట్ర సాగునీటిశాఖా మంత్రిగా ఉన్నప్పుడు రూ.70,000 కోట్లు దుర్వినియోగం చేశారని, ఆ కేసులను చూపించి భయపెట్టి బిజెపి ఆయనను లొంగదీసుకొందని శివసేన ఆరోపించింది. బిజెపికి మద్దతు ఇచ్చినందుకు ప్రతిగా ఆయనపై ఆ కేసులను మాఫీ చేయడానికి ఒప్పందం కుదిరిందనే వాదనలు వినిపించాయి. బిజెపి వాటిని ఖండించింది కూడా. కానీ ఆయన నిన్న తన పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్సీపీ గూటికి చేరుకోవడమే కాకుండా శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నట్లు సమాచారం. 

అజిత్ పవార్ తమకు హ్యాండ్ ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్రహోంమంత్రి అమిత్ షా “ఆ కేసులను మాఫీ చేయలేదని, వాటిపై దర్యాప్తు కొనసాగుతుందని’ బుదవారం ప్రకటించారు. దీంతో ఇప్పుడు శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వానికి అజిత్ పవార్ మూలంగా కొత్త సమస్యలు ఎదురవవచ్చు. కనుక ఆయన సంకీర్ణ ప్రభుత్వానికి గుదిబండగా మారే య్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Related Post