తెలంగాణ బిజెపిలో కేసీఆర్‌ను ఎదుర్కోగలిగేవారెవరో?

November 23, 2019


img

తెలంగాణ బిజెపికి కొత్త అధ్యక్షుడుని నియమించడానికి ఆ పార్టీ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టడంతో పార్టీలో సీనియర్లు, జూనియర్లు, కొత్తగా చేరినవారు అందరూ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకొంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో సహా జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌, రఘునందన్ రావు, కృష్ణసాగర్ రావు, సిహెచ్ రామచంద్రారెడ్డి, డికె.అరుణ, జితేందర్ రెడ్డి, వివేక్ తదితరులు అధ్యక్ష రేసులో ఉన్నట్లు సమాచారం. బరిలో ఉన్నవారందరూ తమకే ఆ పదవి ఎందుకు ఇవ్వాలో...ఇస్తే ఏవిధంగా పార్టీని బలోపేతం చేసి రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురాగలరో తమ అధిష్టానానికి మద్యవర్తుల ద్వారా వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బిజెపి లక్ష్యంగా పెట్టుకొంది కనుక అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నవారిలో సిఎం కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొని, ఆయన వ్యూహాలను చిత్తు చేసి రాష్ట్రంలో బిజెపిని గెలిపించగలవారెవ్వరు? అనే ప్రశ్నకు బిజెపి సమాధానం కనుగొనవలసి ఉంది.    



Related Post