కమిటీలు వద్దు...చర్చలు వద్దు

November 13, 2019


img

నలబై రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెకు చర్చల ద్వారా, హైకోర్టు ద్వారా కూడా పరిష్కారం కాకపోవడంతో చిట్టచివరి ప్రయత్నంగా ముగ్గురు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీలతో ఒక కమిటీని ఏర్పాటు చేద్దామని హైకోర్టు ప్రతిపాదించింది. ఒకవేళ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తే సమ్మెను విరమించి కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండేందుకు సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. కానీ మొదటి నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలకు విముఖత చూపుతున్న తెరాస సర్కార్‌ ఊహించినట్లుగానే హైకోర్టు చేసిన తాజా ప్రతిపాదన తమకు అంగీకారంకాదని తెలియజేస్తూ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

బుదవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మళ్ళీ ఆర్టీసీ కేసులపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. కమిటీ ఏర్పాటుకు తెరాస సర్కార్‌ అంగీకరించలేదు కనుక ఆర్టీసీ కేసులపై హైకోర్టు ఈరోజు తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. 


Related Post