టీఎస్‌ఆర్టీసీలో మరో గుండె ఆగింది

November 06, 2019


img

టీఎస్‌ఆర్టీసీలో ‘మంగళవారం అర్ధరాత్రి గడువు’ ఒక కార్మికుడి నిండు నూరేళ్ళ జీవితానికి గడువుగా మారింది. గడువు ముగిసిన తరువాత సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ ఉండదని, ఆర్టీసీని 100 శాతం ప్రైవేటీకరిస్తామని సిఎం కేసీఆర్‌ చేసిన హెచ్చరికలతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళన చెందిన మాట వాస్తవం. వారిలో కొంతమంది కుటుంబ పరిస్థితులు దయనీయంగా ఉండటంతో గడువులోగా విధులలో చేరారు. మరికొందరు చేరేందుకు ప్రయత్నించారు. కానీ నిన్న అర్ధరాత్రి వరకు డిపోల వద్ద ధర్నాలు చేస్తున్న ఆర్టీసీ కార్మికులు విధులలో చేరేందుకు వచ్చినవారిని అడ్డుకోవడంతో వారు తప్పనిసరిగా సమ్మెలో పాల్గొంటున్నట్లు సమాచారం. 

గడువులోగా విధులలో చేరకపోతే ఆర్టీసీని మూసివేస్తామంటూ సిఎం కేసీఆర్‌ హెచ్చరికలు ఒకవైపు, విధులలో చేరవద్దని ఆర్టీసీ కార్మిక సంఘాల ఒత్తిళ్ళు మరోవైపు. వీటి మద్య నలిగిపోయిన కరీంనగర్‌-2 డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న కరీంఖాన్ బుదవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. “ఇప్పుడు తమ కుటుంబానికి దిక్కెవరని” ఆయన కుమారుడు మహమ్మద్ అసద్ ఖాన్ తమను పరామర్శించడానికి వచ్చిననేతలను ప్రశ్నిస్తున్నారు. కరీంఖాన్ మృతికి ఎవరు బాధ్యత వహిస్తారిప్పుడు? ప్రభుత్వమా...ఆర్టీసీ యాజమాన్యమా... లేక ఆర్టీసీ కార్మిక సంఘాలా? 


Related Post