హుజూర్‌నగర్‌లో తెరాస ఘనవిజయం

October 24, 2019


img

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలలో తెరాస అభ్యర్ధి సైదిరెడ్డి ఘనా విజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ధి పద్మావతి రెడ్డిపై 43,284 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఉపఎన్నికలలో తెరాసకు 1,08,004 ఓట్లు, కాంగ్రెస్‌కు 74,638, బిజెపికి 1,906, టిడిపికి 1,513, ఇతరులకు 2,123 ఓట్లు పడ్డాయి. 

ఈ ఉపఎన్నికలపై ఆర్టీసీ సమ్మె ప్రభావం తప్పక ఉంటుందని కనుక ప్రజలు కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపుతారని ఊహాగానాలు వినిపించినప్పటికీ, అధికార తెరాస అభ్యర్ధిని ఎన్నుకోవడం వలననే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే తెరాస నేతల వాదనలు ఫలించాయని ఫలితాలను బట్టి అర్ధమవుతోంది.    

ఈ ఉపఎన్నికలలో అందరూ ఊహించినట్లే తెరాస-కాంగ్రెస్‌ల మద్యనే పోటీ ప్రధానంగా సాగడంతో రాష్ట్రంలో ఇక టిడిపి అవసరం లేదని ప్రజలు స్పష్టం చేసినట్లయింది. తెరాసకు తామే ఏకైక ప్రత్యామ్నాయమని గొప్పలు చెప్పుకొంటున్న బిజెపికి ఈ ఉపఎన్నికలలో కేవలం 1,906 ఓట్లు మాత్రమే రావడంతో నేటికీ ప్రజలు కాంగ్రెస్ పార్టీనే తెరాసకు ప్రత్యామ్నాయమని భావిస్తున్నట్లు స్పష్టమైంది. కనుక ఎన్నికలలో తెరాస, కాంగ్రెస్‌లను డ్డీకొని ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి రావడం కష్టమని మరోమారు తేలిపోయింది కనుక బిజెపి తన కల నెరవేర్చుకోవడం కోసం మరో మార్గం చూసుకోకతప్పదు.


Related Post