నాలుగు రోజులు ఆగితే అమేజాన్ లో వస్తుందిగా..?

October 14, 2019


img

కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అంటే పరుగులు తీసే ఆడియెన్స్ ఇప్పుడు సినిమా వస్తుంది అంటే వామ్మో అనుకునే పరిస్థితి వచ్చింది. రెగ్యులర్ సిని లవర్స్ టికెట్ రేట్లతో బెంబేలెత్తుతుంటే.. ఫ్యాన్స్ స్టార్ సినిమా అంచనాలను అందుకోలేదని అప్సెట్ అవుతున్నారు. దీనికితోడు థియేటర్ కు వెళ్లి అక్కడ ఏదైనా తిందామంటే రేట్లు చూసి దిమ్మతిరిగిపోతుంది. ఇన్ని టెన్షన్ ఎందుకు అని సగటు ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్లి సినిమా చూసే ఆలోచన కూడా మానుకున్నాడు.  

నలుగు ఇంటి సభ్యులు ఉన్న ఓ ఫ్యామిలీ సినిమా చూసి వస్తే ఇదవరకు మా అంటే 500 వరకు ఖర్చు అయ్యేది కాని ఇప్పుడు అదే ఖర్చు మూడింతలు పెరిగింది. కనీసం 2000 లేనిది సినిమా చూసి రావడం కుదరట్లేదు. అందుకే కొత్తగా డిజిటల్ ఫ్లాట్ ఫాం వచ్చాక ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లి సినిమా చూడటం తగ్గించారు. పైరసీ చూస్తే తప్పుకాని అమేజాన్ లో చూస్తే తప్పేముందని వారు ఫిక్స్ అయ్యారు. అదేమన్నా ఫ్రీగా చూస్తున్నామా డబ్బులు పెట్టే కదా అని అంటున్నారు.      

నిర్మాతలే ముందుకు ముందే డిజిటల్ రైట్స్ అంటూ సినిమాను అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. అయితే ఇది సినిమాపై ఏర్పరచే నష్టాన్ని మాత్రం గుర్తించట్లేదు. ఓ సినిమా సక్సెస్ ఫుల్ గా ఆడుతున్న టైంలో అమేజాన్ ఆన్ లైన్ లో పెట్టేస్తే ఇక థియేటర్ కు వెళ్లి ఎవరు చూస్తారు చెప్పండి. హిట్టు సినిమాకే కాదు ఫ్లాప్ సినిమాలకు ఓ విధంగా ఇది దెబ్బే.        

ఈమధ్య ఓ సినిమా థియేటర్ లో ఆడుతున్న టైంలో అమేజాన్ లో వచ్చే సరికి అనూహ్యంగా ఆ సినిమా కలక్షన్స్ తగ్గాయి. అందుకే డిజిటల్ రైట్స్ వారికి కనీసం సినిమా రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఇవ్వాలని కండీషన్ పెడుతున్నారు. అయితే అప్పటికి కూడా అది సినిమాకు నష్టమే అని భావిస్తున్నారు కొందరు.

అమేజాన్, నెట్ ఫ్లిక్స్ వల్ల థియేటర్ కు వెళ్లడం ఎందుకు దండగా నాలుగు రోజులు ఆగితే అమేజాన్ లో వస్తుందిగా అంటూ సినిమా థియేటర్ కు వెళ్లడమే మానేస్తున్నారు ప్రేక్షకులు. మరి ఈ పరిస్థితి మారే అవకాశం లేకపోగా రాను రాను థియేటర్ కు వెళ్లే ఆడియెన్స్ సంఖ్య తగ్గుతుందని నిర్మాతలు భయపడుతున్నారు. ముఖ్యంగా ఈ ఆన్ లైన్ డిజిటల్ స్ట్రీమింగ్ వల్ల ఓవర్సీస్ లో కలక్షన్స్ మీద గండి పడుతుందని తెలుస్తుంది.        



Related Post