హుజూర్‌నగర్‌ బరిలో 29మంది

October 04, 2019


img

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలకు గురువారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత తెరాస, కాంగ్రెస్‌, టిడిపి, బిజెపిలతో కలిపి మొత్తం 29 మంది అభ్యర్ధులు బరిలో మిగిలారు. స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్లు వేసిన శంకర్, ప్రతాప్ రెడ్డి, సైదులు అనే ముగ్గురు నిన్న తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. తెరాస తరపున సైదిరెడ్డి, కాంగ్రెస్‌ తరపున పద్మావతీ రెడ్డి, టిడిపి తరపున కిరణ్మయి, బిజెపి తరపున కోటా రామారావు ప్రధాన అభ్యర్ధులుగా పోటీ పడుతున్నారు.

ఈసారి కూడా పోటీ ప్రధానంగా తెరాస-కాంగ్రెస్‌ అభ్యర్ధుల మద్యే సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెరాస అభ్యర్ధి సైదిరెడ్డి వెనుక సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెరాస నేతలు ఉండటం సానుకూల అంశమైతే,  కాంగ్రెస్‌ అభ్యర్ధి పద్మావతీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కావడం, వారి కుటుంబానికి నియోజకవర్గంలో మంచి పట్టు కలిగి ఉండటం, పార్టీలో సీనియర్లు అందరూ విబేధాలు పక్కన పెట్టి ఆమెకు మద్దతు పలుకుతుండటం ఆమెకు కలిసివచ్చే అంశాలు. తెరాసకు సిపిఐ, కాంగ్రెస్ పార్టీకి టిజేఎస్‌ మద్దతు ప్రకటించాయి. కనుక ఈ రెండు పార్టీలలో ఏది గెలుస్తుందో చూడాలి. ఈ నెల 21 పోలింగ్ జరుగుతుంది. ఈనెల 24న ఫలితాలు వెలువడుతాయి.


Related Post