సిఎం కేసీఆర్‌ డిల్లీ అకాల పర్యటన దేనికో?

October 02, 2019


img

ప్రధాని నరేంద్రమోడీ, సిఎం కేసీఆర్‌ రెండవసారి అధికారం చేపట్టిన తరువాత ఇప్పటివరకు కలుసుకోలేదు. సిఎం కేసీఆర్‌ గురువారం సాయంత్రం డిల్లీ వెళ్ళి మరుసటి రోజు ఉదయం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కాబోతున్నారు. అంతకంటే ముందుగా రేపు సాయంత్రం ఒకరిద్దరు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. 

ఆర్ధిక మాంద్యం కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గుముఖం పట్టడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు సకాలంలో విడుదల చేయవలసిందిగా ప్రధాని నరేంద్రమోడీని కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబందించిన సమస్యలు, ఇతర అంశాలపై ప్రధాని నరేంద్రమోడీతో చర్చించనున్నట్లు సమాచారం. 

కాంగ్రెస్‌, బిజెపిలవలన దేశానికి ఒరిగిందేమీ లేదని, కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి పైసా విదిలించడంలేదంటూ సిఎం కేసీఆర్‌తో సహా తెరాస మంత్రులు, నేతలు పదేపదే విమర్శలు గుప్పిస్తున్నందున, నిధుల విడుదలకు సిఎం కేసీఆర్‌ చేసే అభ్యర్ధనలను ప్రధాని నరేంద్రమోడీ పట్టించుకుంటారో లేదో చూడాలి. అయితే మీడియా ఊహిస్తున్నట్లు సిఎం కేసీఆర్‌ పర్యటన కేవలం రాష్ట్ర సమస్యల పరిష్కారానికేనా లేక రాజకీయ అవసరాలు, ప్రయోజనాలు కూడా ఏవైనా ఉన్నాయా? అనేది రానున్న రోజులలో మెల్లగా బయటపడుతుంది. 


Related Post