టిజేఎస్‌ మద్దతు కోరిన కాంగ్రెస్

October 02, 2019


img

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో తెరాస కాంగ్రెస్‌ పార్టీల మద్యనే ప్రదానంగా పోటీ ఉండబోతోంది. ఇప్పటివరకు ప్రతీ ఎన్నికలలోనూ ఒంటరిగానే ప్రతిపక్షాలను ఎదుర్కొని విజయం సాధిస్తున్న తెరాస మొదటిసారిగా సిపిఐ మద్దతు కోరడం, అందుకు సిపిఐ అంగీకరించడం విశేషమే. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో తమతో జతకట్టిన సిపిఐ పార్టీ, ఈసారి తెరాసకు మద్దతు పలకడంతో, కాంగ్రెస్ పార్టీ తమ మిత్రపక్షమైన టిజేఎస్‌ మద్దతు కోరింది. కాంగ్రెస్‌ నేతలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రసాద్ కుమార్ టిజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కలిసి మద్దతు కోరారు. పార్టీలో చర్చించుకొని నిర్ణయం తెలియజేస్తామని కోదండరాం చెప్పారు. ఈ ఎన్నికలలో టిజేఎస్‌ కూడా పోటీ చేయడం లేదు...సిపిఐ, సిపిఎంలతో కలిసి పనిచేసే అవకాశం లేనందున కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఉప ఎన్నికలలో తెరాస, కాంగ్రెస్‌, బిజెపి, టిడిపిలు బరిలో నిలిచినందున ఈ బహుముఖపోటీ వలన తెరాస, కాంగ్రెస్‌ పార్టీలలో దేనికి లాభం, దేనికి నష్టం జరుగుతుందో చూడాలి.  



Related Post