మా 'మనోభావాలు' దెబ్బతిన్నాయ్..!

September 25, 2019


img

రెండున్నర గంటల సినిమా కొందరు విజ్ఞానం కోసం చూస్తే కొందరు మానసిక ఉల్లాసం కోసం చూస్తారు. ఎక్కువగా.. సినిమా అనే మాధ్యమం ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే దర్శక నిర్మాతలు అనుకుంటారు. అయితే సినిమా కథలన్ని ఇతి హాసాల నుండే తీసుకుంటారన్న విషయం తెలిసిందే. రామాయణ, మహా భారతాల నుండే సినిమా కథలు వస్తుంటాయి. అయితే కొన్నిసార్లు చరిత్రగా చెప్పుకునే కొందరి ప్రముఖుల జీవితాలు ఆధారంగా కథలు రాస్తుంటారు.        

అయితే అలాంటి సినిమాలకు ఒకప్పుడు బాగా క్రేజ్ ఉండేది. చరిత్ర మరచిన గొప్ప వ్యక్తుల గురించి నేటి సమాజానికి తెలిసేలా చేయడం మంచి విషయమే. అయితే ఇలాంటి సినిమాలు తీయాలంటే మాత్రం దర్శక నిర్మాతలు భయపడుతున్నారు. అలా ఎందుకు అంటే తీసే సినిమా ఒక వర్గానికి చెందినదైతే ఆ వర్గం వారు.. కులానికి చెందిన వారైతే కులపు వాళ్లు.. జాతికి చెందిన వారైతే జాతి నేతలు.. మతానికి చెందిన వారైతే మత పెద్దలు.. ఇలా ఎవరో ఒకరు వచ్చి మీ సినిమా ఆపేయాల్సిందే. మా మనోభావాలు దెబ్బతిన్నాయ్ అనేస్తున్నారు.    

వారు కూడా మర్చిపోయిన వ్యక్తుల జీవితాలను సినిమాగా తీయడమే దర్శక నిర్మాతల తప్పు అన్నట్టుగా ఎవరైతే మనోభావాలు దెబ్బ తిన్నాయ్ అంటున్న వారు సినిమాను అడ్డుకుంటున్నారు. రీసెంట్ గా వాల్మీకి టైటిల్ తో వచ్చిన వరుణ్ తేజ్ సినిమాను రిలీజ్ రేపనగా మూడు నాలుగు గంటల ముందు టైటిల్ మార్చేలా చేశారు.     

ఇక రాబోతున్న సైరా సినిమాకు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆ సినిమాను రిలీజ్ కానివ్వమని చెబుతున్నారు. మరి వ్యక్తుల జీవితాలు కుటుంబానికి సంబందించినవే అయితే వారిని ఆదర్శంగా తీసుకున్న వారి పరిస్థితి ఏంటి. వాల్మీకి.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారు కేవలం ఒక కుటుంబానికో.. ఒక వర్గానికే చెందిన వారు కాదు వాల్మీకి మహర్షి అయితే.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి భరత మాత కోసం బ్రిటీష్ వారి మీద యుద్ధం చేసిన మగధీరుడు. మరి అలాంటి వ్యక్తుల గురించి ప్రపంచానికి తెలిసేలా చేస్తున్న సినిమా వాళ్ల ప్రయత్నాన్ని మనోభావాలంటూ అడ్డుకోవడం ఎంతవరకు కరెక్టో వారికే తెలియాలి.       



Related Post