అందుకే విద్యాసాగర్ రావును రాష్ట్రానికి తిప్పి పంపిందా?

September 17, 2019


img

ఒకప్పుడు తెలంగాణ బిజెపిలో సీనియర్ నేతగా ఉన్న సిహెచ్ విద్యాసాగర్ రావును 2014లో మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులవడంతో పార్టీని వీడి ఆ బాధ్యతలు చేపట్టారు. ఆయన 2014 నుంచి 2019 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. కానీ మళ్ళీ ఆయనకు మరో అవకాశం ఇవ్వకపోవడంతోరాష్ట్రానికి తిరిగివచ్చి మళ్ళీ రాజకీయాలలోకి ప్రవేశించారు.

సోమవారం హైదరాబాద్‌లోని బిజెపి కార్యాలయంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆయనకు పార్టీ ప్రాధమిక సభ్యత్వం అందజేసి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్ళీ తల్లి ఒడికి చేరుకున్న అనుభూతి పొందుతున్నానని అన్నారు. రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనపడటంతో బిజెపిని బలోపేతం చేసుకోవాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది కనుకనే విద్యాసాగర్ రావుకు రాష్ట్రానికి పంపించి ఉండవచ్చు లేకుంటే ఆయనను వేరే రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించి ఉండేది. కనుక ఇక నుంచి ఆయన కూడా కేసీఆర్ సర్కార్‌పై బాణాలు సందించడం మొదలుపెడతారేమో?


Related Post