కొండను తవ్వి ఎలుకను పట్టిన కాంగ్రెస్‌

August 11, 2019


img

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు శనివారం డిల్లీలో సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు ఉదయం నుంచి రాత్రి వరకు చర్చించిన తరువాత కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు మళ్ళీ సోనియాగాంధీకే పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. కొత్త అధ్యక్షుడుని ఎన్నుకునేవరకు ఆమె తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నట్లు పార్టీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిన్న రాత్రి మీడియాసమావేశంలో ప్రకటించారు. 

సోనియా, రాహుల్, ప్రియాంకా ముగ్గురూ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టడానికి నిరాకరించి, కొత్త అధ్యక్షుడుని ఎన్నుకోవలసిందిగా సూచించినప్పటికీ, వారు ముగ్గురూ కాక బయటవరెవరికి పార్టీ పగ్గాలు అప్పగించినా కాంగ్రెస్ పార్టీ నిలువునా చీలిపోయే ప్రమాదం ఉందనే భయంతో కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

తద్వారా నెహ్రూ వారసులనుకాదని కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించలేదని వారు స్వయంగా మరోసారి చాటి చెప్పుకున్నట్లయింది. ఒకవేళ ఇదే నిజమనుకుంటే ఎప్పటికీ వేరే వ్యక్తిని ఎన్నుకోవడం సాధ్యం కాదు కనుక మళ్ళీ పరిస్థితులు చల్లబడిన తరువాత రాహుల్ గాంధీ లేదా ప్రియాంకా వాద్రా కాంగ్రెస్‌ పగ్గాలు చెప్పటడం ఖాయమనే భావించవచ్చు.


Related Post