సోనియా, రాహుల్ ఎందుకు డుమ్మా కొట్టారో?

August 09, 2019


img

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గురువారం భారతరత్న అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. దశాబ్ధాలపాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ఆయన ఇటువంటి అత్యున్నత పురస్కారం అందుకొంటున్నప్పుడు, ఆ కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు హాజరవుతారని ఆశించడం సహజం. కానీ రాష్ట్రపతి భవన్‌లో నిన్న సాయంత్రం జరిగిన ఆ కార్యక్రమానికి వారిరువురూ హాజరుకాలేదు. కేంద్రమంత్రులు, బిజెపి అగ్రనేతలు మాత్రమే హాజరయ్యారు. వారందరూ ఆయనకు అభినందనలు తెలిపారు.

ఆయన బిజెపికి, ఆర్ఎస్ఎస్‌ పెద్దలతో సన్నిహితంగా మెలుగుతుండటం వారికి నచ్చలేదని అందుకే ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారని సమాచారం. అయితే ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్న తరువాత కూడా వారిరువురూ ఇంకా ఆ విషయాలను మనసులో పెట్టుకొని ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం విమర్శలకు తావిచ్చింది. ప్రతీ విషయాన్ని రాజకీయ భూతద్దంలో నుంచే చూస్తూ, దాని వలన కలిగే లాభనష్టాలను లెక్కగట్టుకొని వ్యవహరించే దురలవాటు వలన కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే నష్టమే కలిగిస్తుందని అనేకసార్లు నిరూపితమైంది. మళ్ళీ మరోసారి అదే జరిగింది. 


Related Post